NTV Telugu Site icon

Elections 2024: విజయనగరం జిల్లాలో ప‌ర్యటించిన రాష్ట్ర‌ ఎన్నిక‌ల అధికారులు..!

9

9

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో ఇప్పటికీ దేశంలోని అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున రాజకీయ సభలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగానే.. ఎలక్షన్స్ కమిషన్ సంబంధించిన అధికారులు ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకొని కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇక అసలు విషయం లోకి వెళ్తే..

Also read: Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేడు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా పర్యటించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ అలాగే జిల్లాలోని ఉన్నతాధికారులతో ఆయన సమావేశం అయ్యారు. విజయనగరం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన కలెక్టర్ నాగలక్ష్మి నుంచి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు కోటి 54 లక్షల రూపాయల విలువైన నగదును, అలాగే మద్యంను స్వాధీనం చేసుకున్నారని ఆవిడ ఎన్నికల అధికారికి తెలిపారు.

Also read: Pakistan: మాపైనే రైడ్స్ చేస్తారా.? పోలీసులను చితక్కొట్టిన పాక్ ఆర్మీ.. వీడియో వైరల్..

విజయనగరం జిల్లాలో ఎన్నికలను సజావుగా పూర్తిచేసేందుకు, అలాగే శాంతిభద్రల పర్యవేక్షణకు తీసుకున్న చర్యలను ఎస్పీ దీపిక ఎన్నికల అధికారులకు తెలిపారు. మీటింగ్ తర్వాత ఎన్నికల కంట్రోల్ రూమ్ ను ఎన్నికల పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా పరిశీలించారు. అలాగే ఎంసిఎంసి, కంప్ల‌యింట్ సెల్‌, 24 గంట‌ల కాల్ సెంట‌ర్‌, సి విజిల్ త‌దిత‌ర విభాగాల ప‌నితీరుపై మిశ్రా ఆరా తీశారు.