ఎన్నికల ఉద్యోగికి పాముకాటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమో న్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగి విపుల్ రెడ్డిని పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. అక్కడి 15వ పోలింగ్ కేంద్రంలో టాయిలెట్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆయన్ను 108 అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా విపుల్ రెడ్డి జైనథ్ మండలం ముక్తాపూర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.. ఆయనకు అందర్ బంద్ పోలింగ్ కేంద్రంలో ఓపీవో గా విధులు కేటాయించారు. రిటర్నింగ్ అధికారి రాజర్షి షా ఫోన్ లో పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు…