Site icon NTV Telugu

Election Results: మహారాష్ట్రలో బీజేపీ సంచలనం.. జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి..

Election Results

Election Results

Election Results: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హోరాహోరీని తలపిస్తున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతోంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 41. అయితే, బీజేపీ కూటమి, జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి మధ్య లీడ్ మారుతోంది. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. బీజేపీ 31, కాంగ్రెస్ కూటమి 48 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యం కనబరిచారు. మహారాష్ట్రలో సంచలన విజయం దిశగా బీజేపీ కూటమి వెళ్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉంటే, ప్రస్తుతం 218 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్‌లో ఉండగా, 58 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) లీడింగ్‌లో ఉంది.

Exit mobile version