Site icon NTV Telugu

Telangana Municipalities: నేడు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ల ఎన్నిక

Revanth

Revanth

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం చివరి అంకానికి చేరుకున్నది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలుపొందిన వారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మున్సిపాలిటీలలో వార్డు మెంబర్లు, కార్పొరేషన్ లలో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనున్నది. అనంతరం కార్పొరేషన్ లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రారంభంకానుంది. వీటితో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌, వైస్ ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక నిర్వహించనున్నారు.

Also Read:Allu Shirish Wedding: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. మెగాస్టార్ దంపతులకు ఫస్ట్ ఇన్విటేషన్!

ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్నికైన సబ్యులకు సమాచారం ఇచ్చిన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనాలని సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులకు నోటీసులు ఇచ్చారు ఎన్నికల అధికారులు. మేయర్లు, చైర్మన్ల ఎన్నిక కార్యక్రమాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మేయర్లు, ఛైర్‌పర్సన్‌ల ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు.

Exit mobile version