Site icon NTV Telugu

EC Big order: వికసిత్ భారత్ మెసేజ్‌పై కేంద్రానికి కీలక ఆదేశం

Vb

Vb

వికసిత్ భారత్ వాట్సాప్ సందేశాలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళింపించింది. తక్షణమే సందేశాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ప్రతిపక్షాల ఫిర్యాదులతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 16న దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. మొబైల్ వినియోగదారులకు వాట్సాప్‌లో వికసిత్ భారత్ పేరుతో సందేశాలు పంపించింది. అభివృద్ధి కావాలంటే తిరిగి మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని సందేశం యొక్క సారాంశం. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తక్షణమే సందేశాలు నిలిపివేసేలా ఆదేశాలను జారీ చేయాలని కోరాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ సందేశాలు పంపిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్.. వికసిత్ భారత్ వాట్సాప్ మెసేజ్‌లు నిలిపివేయాలని కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశించింది.

మెసేజ్‌లో ఏముందంటే..
‘‘నమస్తే.. ఈ లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పంపింది. గత 10 సంవత్సరాలలో 140 కోట్ల మంది భారతీయులు.. ప్రభుత్వం నుంచి వివిధ పథకాలు ప్రయోజనం పొందారు. మరియు భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. వికసిత్ భారత్‌ కోసం మీరు కూడా భాగస్వాములు కండి. మీ అభిప్రాయం, సూచనలను దయచేసి భాగస్వామ్యం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నట్లు లేఖలో’’ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దేవ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించనుంది. తొలి విడతగా ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

 

Exit mobile version