Site icon NTV Telugu

Big Breaking: డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు

Anjanikumar

Anjanikumar

DGP Anjani Kumar: తెలంగాణ ఎన్నికలు వెలువడుతున్న నేపథ్యంలో ఈసీ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న తరుణంలో టీపీసీసీ రేవంత్‌ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు గానూ ఈ షాకింగ్‌ నిర్ణయాన్ని ఈసీ తీసుకుంది.

Read ALso: KCR Resignation: గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపిన కేసీఆర్‌

మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ జైన్‌లకు నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈ ఐపీఎస్‌ అధికారులపై ఈసీ కొరడా ఝులిపించింది. అంజనీ కుమార్‌తో పాటు రేవంత్‌ను ఈ ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కలిసినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకుల్ని కలవద్దని కోడ్ ఉన్నప్పటికీ దానిని ఉల్లంఘించి కలిశారన్న అభియోగంపై డీజీపీ సస్పెండ్‌తో పాటు ఇద్దరు పోలీస్ అధికారులకి నోటీసులు జారీ చేసింది. ఒకవైపు కౌంటింగ్ పూర్తికాకుండానే డీజీపీ వెళ్లి పీసీసీ అధ్యక్షుడిని కలవడంపై ఈసీ సీరియస్ అయ్యింది.

Exit mobile version