Site icon NTV Telugu

Election Commission: రెండో రౌండ్‌కు సిద్ధమైన ఈసీ.. ఈసారి 476 పార్టీలు..!

Election Commission

Election Commission

Election Commission: ఎన్నికల వ్యవస్థను క్లీన్‌ చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలను గుర్తించి ఆగస్టు 9న 334 పార్టీలను జాబితా నుంచి తొలగించగా.. తాజాగా రెండో రౌండ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కొత్తగా మరో 476 పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలకు చేపట్టినట్లు తెలిపింది. తాజాగా డీలిస్ట్‌ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

READ MORE: Target Ambani: అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్..

ఫస్ట్ రౌండ్‌లో 334 పార్టీలు..
2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయాలనే ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో విఫలమైన రిజిస్టర్డ్‌ గుర్తింపు లేని రాజకీయ పార్టీల(RUPPs)ను గుర్తించేందుకు ఈసీ చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 9న ఫస్ట్ రౌండ్‌లో 334 పార్టీలను గుర్తించి జాబితా నుంచి తొలగించింది. ఇప్పుడు తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించినట్లు వెల్లడించింది. తాము డీలిస్ట్‌ చేసిన పార్టీలేవీ.. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 29సీ, 29బీ ఆదాయపన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్‌ అండ్‌ ఎలాట్‌మెంట్‌) ఆర్డర్‌ 1968 కింద ఉన్న ప్రయోజనాలను పొందలేవని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా కొత్త జాబితాను విడుదల చేసింది. రాజకీయ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ జూన్‌లో ఈ దిశగా చర్యలను స్టార్ట్ చేసినట్లు పేర్కొంది.

READ MORE: Target Ambani: అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్..

Exit mobile version