NTV Telugu Site icon

Election Commission: డీబీటీ పథకాల అమలు.. సీఎస్‌కు ఈసీ కీలక ఆదేశాలు..

Cs

Cs

Election Commission: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల కమిషన్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఎన్నికల కమిషన్‌.. రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది.. లబ్ధిదారుల ఖాతాలకు నిధుల జమలో జరిగిన జాప్యంపై వివరణతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. ఖాతాలకు నిధులను జమ చేయడంలో జరిగిన జాప్యంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.. మొత్తం ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే విషయమై జాబితాను లేఖలో ప్రస్తావించిన ఈసీ. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి రూ. 14,165.66 కోట్లకు బటన్ నొక్కారని పేర్కొంది.. అయితే, ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్‌కు ముందు 11, 12వ తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో వెల్లడించింది ఈసీ.. పోలింగ్ కు ముందు లబ్ధిదారుల ఖాతాలకు నిధుల విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనే అవుతుందని తెలిపింది.. అయితే, ఎన్నికల కోడ్ ముగిశాక లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయాలని ఆదేశించింది ఎన్నికల కమిషన్‌.

Read Also: Sivakarthikeyan : దళపతి విజయ్ మూవీలో శివకార్తికేయన్..?

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నిలకు సంబంధించిన పోలింగ్‌ ముగిసిన తర్వాతే.. సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలని సూచించింది ఎన్నికల కమిషన్‌.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులకు పోలింగ్ తేదీ తర్వాత నగదు జమ చేసుకోవచ్చని ఏపీ హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా.. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే దీనిపై స్పందించిన ఈసీ.. పోలింగ్ తేదీ తర్వాత నగదు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని కోర్టుకు తెలిపిన విషయం విదితమే.

Show comments