Janasena: జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా గ్లాసు గుర్తునే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై ఆదేశాలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకే గ్లాసు గుర్తు కేటాయించేలా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల గుర్తుల నిబంధనల్లోని పారా 10 బీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గ్లాసు గుర్తు మాత్రమే కేటాయించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చెందిన జైభారత్ నేషనల్ పార్టీకి కూడా టార్చిలైటు గుర్తును అన్ని నియోజకవర్గాల్లోనూ వర్తింప చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఎన్నికల సంఘం పేర్కొంది.
Read Also: CM YS Jagan: రేపటి సీఎం జగన్ ప్రచార సభల షెడ్యూల్ ఇదే..