NTV Telugu Site icon

Election Commission: 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, జూలై 10న ఓటింగ్

Ec

Ec

Election Commission: బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. జూలై 10వ తేదీన ఎన్నికలు, జూలై 13న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.

Read Also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్

ఇక, బీహార్‌లో ఒక స్థానానికి, బెంగాల్‌లో 4, తమిళనాడులో 1, మధ్యప్రదేశ్‌లో 1, ఉత్తరాఖండ్‌లో 2, పంజాబ్‌లో 1, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలోని 3 స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానాలకు సంబంధించి జూన్ 14వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ చెప్పుకొచ్చింది. నామినేషన్‌ వేసేందుకు చివరి తేదీ జూన్ 21 కాగా.. జూన్ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్ 26గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. జూలై 10న ఓటింగ్ నిర్వహించి, జూలై 13న ఫలితాలు వెల్లడించనున్నాయి.