Site icon NTV Telugu

Kishan Reddy: మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం బాగుంటుంది

Kishane Reddy

Kishane Reddy

దేశం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో తెలిపే ఎన్నికలే జరగబోయే ఎన్నికలని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్‌లో కార్నర్ మీటింగ్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. మోడీ మూడోసారి అధికారంలోకి రావాలంటే.. మే 13న అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Taapsee Pannu Marriage: అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా: తాప్సీ

‘‘కరోనా కాలంలో మన ప్రాణాలు కాపాడటం కోసం మోడీ చర్యలు తీసుకున్నారు. కరోనాలో తినడానికి తిండి లేకపోతే ఉచిత బియ్యం ఇచ్చాం. ప్రతి పేద ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని.. టాయిలెట్స్ మోడీ సర్కార్ కట్టించింది. రాజకీయం, మిలటరీ ఇలా అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాం. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్స్‌ని కొత్తగా కడుతున్నాం. బస్తీ దవాఖానాలకు నిధులు ఇచ్చేది మోడీనే. కొమరవెల్లిలో కూడా రైల్వే స్టేషన్ మంజూరు చేయిపించాం. దేశంలో ఎక్కడా ఉగ్రవాద కార్యక్రమాలు.. బాంబు పేలుళ్లు లేవు. కాంగ్రెస్ పార్టీ అంటనే దోపిడీ… రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది.. దోపిడీ స్టార్ట్ అయ్యింది. కేసీఆర్ తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చేసి దోచేశారు. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 2500 ఇస్తామన్నారు.. ఇప్పటిదాకా అతీగతి లేదు.’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ఇది కూడా చదవండి: Balineni Srinivasa Reddy: ఇప్పుడున్న వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పగలరా..?

‘‘కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టింది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామన్నాడు కానీ ఆయనొక్కడే ఇల్లు కట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇళ్లు ఇస్తామంది కానీ ఇంకా ఏం పని జరగలేదు. ఆదర్శ వ్యక్తి రాముడు.. ఇప్పుడు ఆయనకు గుడిని నిర్మించుకున్నాం. రామ భక్తుడిగా మోడీ రాముడి దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు 302 సీట్లు ఉన్నాయి.. ఈ సారి 400 దాటుతాయి. కాంగ్రెస్‌కు 40 సీట్లు ఉన్నాయి.. ఇప్పుడు అవి కూడా వస్తాయో లేదో తెలియదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ కనిపించరు. 2019 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ మూడు నెలలు కనబడలేదు. లిక్కర్ వ్యాపారం చేసి కవిత తీహార్ జైల్లో ఉంది.. కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌లో ఉన్నారు.. పూర్తిగా అక్కడే ఉంటారు.’’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Nitish Reddy Record: ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి.. నితీశ్‌ రెడ్డి సంచలన రికార్డు!

Exit mobile version