NTV Telugu Site icon

Rajasthan: తుంటరులు పిచ్చి పనులు.. చెత్త ఏరుకునే వృద్ధుడి ఆత్మహత్య

Auxw

Auxw

ఈ మధ్య యువత రీల్స్ మోజులో పడి ఏం చేస్తున్నారో.. వారికే అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కోసమో.. లేదంటే లైకుల కోసమో వెంపర్లాడుతున్నారు. వారి ఆనందం కోసం ఇతరుల్ని కూడా బలి చేస్తున్నారు. తాజాగా తుంటరుల వికృత చర్యలకు ఓ వృద్ధుడి ప్రాణాలు పోయాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని లోహావత్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Mahua Moitra: ‘వారియర్స్ ఆర్ బ్యాక్’.. మహిళా ఎంపీలతో ఉన్న ఫొటో పోస్ట్

ప్రతాబ్ సింగ్ అనే వృద్ధుడు ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలు సేకరించి చెత్తను విక్రయిస్తూ జీవిస్తూ ఉంటాడు. బండిపై వస్తువులను సేకరిస్తూ గ్రామంలో అందరికీ సుపరిచితుడు. బాబాజీ అని అందరూ పిలుస్తుంటారు. అయితే గ్రామంలో కొందరు యువకులు అతనిని ఎగతాళి చేయడం.. అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేయడంతో అతడు తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో హైవే సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రతాబ్ సింగ్ ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్గానికి తరలించారు. కొంత మంది యువకులు చేసిన హేళనతో బాధపడి ప్రతాబ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం