Site icon NTV Telugu

Fish Prasadam : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

Heart Attack Fish Prasad

Heart Attack Fish Prasad

Fish Prasadam : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుల చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు చేప ప్రసాదం పొందేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..!

సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనను పరీక్షించి వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేశారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

Exit mobile version