Site icon NTV Telugu

Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్‌.. ఎప్పటినంచంటే..

Chicken Price

Chicken Price

తెలంగాణలోని మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయాలను నిలిపివేస్తూ బంద్ పాటించాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ వ్యాపారులు పౌల్ట్రీ కంపెనీల విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న తీరు వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ‘తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్’ ఆరోపిస్తోంది. గతంలో ఇచ్చే కమీషన్ కంటే ప్రస్తుతం కిలోకు రూ. 20 వరకు తగ్గించడం తమకు పెను భారంగా మారిందని వారు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 360 నుంచి రూ. 370 వరకు పలుకుతోంది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు వ్యాపారులకు వచ్చే లాభం కూడా పెరగాలి.. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు వినియోగదారులపై భారం పెరుగుతున్నా, మరోవైపు కంపెనీలు తమ మార్జిన్‌ను తగ్గించడంతో షాపుల నిర్వహణ కష్టతరమవుతోందని విక్రయదారులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఆ భారాన్ని అంతా తమపైనే వేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

Also Read:Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!

ఈ సమస్యపై ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు మూసివేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. మార్జిన్ పెంచే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. చికెన్ షాపులు నిరవధికంగా బంద్ అయితే సామాన్య ప్రజలకు మాంసం దొరకడం కష్టమవుతుంది. ఇది పరోక్షంగా ఇతర మాంసాహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం , పౌల్ట్రీ కంపెనీలు వెంటనే స్పందించి ఈ గొడవను పరిష్కరించాలని సామాన్యులు కోరుతున్నారు.

Exit mobile version