Site icon NTV Telugu

Eknath Shinde: ఉల్లి ధరలపై నిరసన తీవ్రతరం.. అన్నదాతలను కలవనున్న ముఖ్యమంత్రి

Maharahstra

Maharahstra

Maharashtra CM Eknath Shinde: మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది. ఆదివారం ప్రారంభమైన ఈ పాదయాత్ర నాలుగు రోజులుగా కొనసాగుతోంది. భారత కమ్యూనిష్ట్​ పార్టీ (మార్కిస్ట్​) అధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర​ జరుగుతోంది. ఈ పాదయాత్రలో రైతులు, రైతుకూలీలు, గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ. 600 తక్షణ ఆర్థిక సాయాన్ని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ముంబై వైపు పాదయాత్ర చేస్తున్న వేలాది మంది రైతులు, గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి బృందంతో మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం మరో దఫా చర్చలు జరుపుతుందని మాజీ ఎమ్మెల్యే జీవా గవిత్ లాంగ్ మార్చ్‌కు నేతృత్వం వహించారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నుండి ముంబై వైపు కవాతు చేస్తున్న రైతులు, గిరిజనులు థానే జిల్లాలోకి ప్రవేశించినప్పుడు, మంత్రులు దాదా భూసే, అతుల్ సవే బుధవారం అర్థరాత్రి రైతుల ప్రతినిధి బృందాన్ని కలిశారు. గురువారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లతో సమావేశానికి రైతులు, గిరిజనుల ప్రతినిధుల బృందాన్ని మంత్రులు ఆహ్వానించినట్లు మాజీ శాసనసభ్యుడు గవిత్ తెలిపారు. వారు 40 శాతం డిమాండ్లకు స్పందించారని ఆయన చెప్పారు. తమకు అందిన ఆహ్వానాన్ని గౌరవిస్తూ , సమావేశానికి హాజరు కాబోతున్నామని గవత్ చెప్పారు. ప్రభుత్వం నుంచి సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే పాదయాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Read Also: 144 section kcr residence: 2వ సారి ఈడీ విచారణకు కవిత.. ఢిల్లీలో కేసీఆర్ నివాసం వద్ద 144 సెక్షన్..

బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో, తమ డిమాండ్లలో కొన్నింటిపై మంత్రులు సానుకూలంగా ఉన్నారని గవిత్ చెప్పారు. అయితే రాష్ట్ర సచివాలయంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ. 600 తక్షణ ఆర్థిక సహాయం, 12 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ రుణాల మాఫీ సహా వివిధ డిమాండ్‌లకు మద్దతుగా నిరసనకారులు ఎర్రజెండాలు పట్టుకుని ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని నాసిక్ జిల్లాలోని దిండోరి పట్టణం నుంచి తమ పాదయాత్రను ఆదివారం ప్రారంభించారు.

Exit mobile version