NTV Telugu Site icon

EGG : సామాన్యులకు షాకిస్తున్న గుడ్డు.. రేటు భలే ఘాటు..

Egg

Egg

నాన్‌వెజ్‌ ప్రియులకు ఇది చేదు వార్తే అని చెప్పాలి. అయితే.. సండే వచ్చిదంటే నాన్‌ వెజ్‌తో ఆరగించే వారి జేబులకు చిల్లు పడుతోంది. ఇప్పటికే మటన్‌, చికెన్‌ ధరలు పెరిగినా.. కోడిగుడ్డుతో సరిపెట్టుకుందామనుకునేవారు. కానీ.. ఇప్పుడు గుడ్డు ధర కూడా పెరిగి కూర్చుంది. ఇప్పుడు ఆ గుడ్డు తెచ్చుకోవాలన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తున్నాయి మార్కెట్లో ప్రస్తుత కోడి గుడ్ల ధరలు. రోజురోజుకూ ధరలు కొండెక్కుతూ.. సామాన్యుడికి జేబుకు చిల్లుపెడుతున్నాయి. డజను గుడ్ల ధర రూ.80కి పెరగగా.. ఒకదాని ధర రూ.7 అయింది.
Also Read : Minister KTR : సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టాలను అమలు చేస్తాం

అయితే.. ఏడాదిగా డజను గుడ్లు రూ.65 నుంచి రూ.70 ఉండగా.. ఒకటి రూ.6కి వచ్చేది. 10 రోజుల్లోనే ఏకంగా డజను గుడ్ల ధర రూ. 80కి ఎగబాకింది. వినియోగంతో పాటు.. దానా ధరలు పెరగడమే అధిక ధరలకు కారణమని నిర్వాహకులు. 2020లో గుడ్లు పెట్టే కోళ్లకు వేసే దానా ధర రూ.14 నుంచి 16 ఉండగా.. నేడు రూ.28 నుంచి 30కి పెరిగింది. రాబోయే కాలంలో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. కాగా, కోడి గుడ్ల ధరలు అమాంతం ఒక్కసారిగా పెరగడంతో గుడ్డు తినాలంటే జనం ఆలోచిస్తున్నారు.