NTV Telugu Site icon

Eetala Rajender: మత్స్యకారులు అందరూ ఒక్క తాటిపైకి రావాలి

Chegunta

Chegunta

మెదక్ జిల్లా చేగుంటలో ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్‌రావు.. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో 40 వేల మంది మత్స్యకారులు ఉన్నారన్నారు. మత్స్యకారులు అందరూ ఒక్క తాటిపైకి వస్తే ఈ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లల్లో నాణ్యత లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పడింది. అడుక్కుంటే హక్కులు రావు.. కొట్లాడితేనే వస్తాయన్నారు ఈటల రాజేందర్.

Read Also:Singer Mangli: నాపై దాడి జరగలేదు.. అవన్నీ ఫేక్ వార్తలు

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ.. ముదిరాజులు ఇంత మంది ఉండి ఒక్క ఈటల రాజేందర్ ముదిరాజుని అసెంబ్లీకి పంపితే ఆయన ఏం చేస్తాడు. భారత ప్రభుత్వం మత్స్యకారుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. ఇంగ్లాండ్ కన్నా భారతదేశం ఎక్కువ చేపలను ఎగుమతి చేస్తుంది. ప్రధాని మోడీ రైతుల అభివృద్ధితో పాటు , మత్స్యకారుల కోసం కూడా ఆలోచిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతాం అన్నారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ముదిరాజ్ సమస్యలు తెలుసుకోవడానికి మెదక్ కి వచ్చానన్నారు పురుషోత్తం రూపాల.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ లో చేపలు పట్టుకోవడానికి బెస్త, ముదిరాజ్, గంగపుత్రులకు చేపలు పట్టుకునే హక్కు ఇవ్వాలి. బెస్త ,ముదిరాజ్, గంగపుత్రుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతానన్నారు. ముదిరాజుల్లో ఐక్యత లేదు, కాబట్టి కెసిఆర్ పరిపాలన నడుస్తుంది. మెదక్ జిల్లాలో ముదిరాజులు ఐక్యంగా లేరు… ఐక్యం చేయడానికే ఈటెల రాజేందర్ ని రమ్మని చెప్పాం అన్నారు రఘునందన్ రావు.

Read Also: Andhra Pradesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ సబ్‌‌ప్లాన్ చట్టం గడువు పెంపు