NTV Telugu Site icon

Eesha Rebba : విశ్వక్ తో ఈషా రెబ్బా ఐటమ్ సాంగ్.. కానీ..?

Eesha Rebba

Eesha Rebba

Eesha Rebba : మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.రీసెంట్ గా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్  గ్రాండ్ జరిగింది.ఈ ఈవెంట్ కు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చారు.ఈ సినిమాతో విశ్వక్ మంచి విజయం అందుకోవాలని బాలయ్య విశ్వక్ సేన్ ను ఆశీర్వదించారు.

Read Also : Karthikeya : ఆ విషయంలో నేనెప్పుడూ బాధ పడలేదు..

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ టీజర్,ట్రైలర్ ,సాంగ్స్ ప్రేక్షకులని విపరీతముగా ఆకట్టుకున్నాయి.ఈ చిత్రంలో మోత మోగిపోద్ది అంటూ సాగే ఓ ఐటెం సాంగ్ ఉంది. విశ్వ‌క్‌సేన్‌, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ న‌టి అయేషా ఖాన్ లు క‌లిసి ఈ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఈ పాట ఇప్పుడు బాగా ట్రేండింగ్ లో వుంది.అయితే ఈ సాంగ్ కు ముందుగా ఈషా రెబ్బ ను మేకర్స్ సంప్రదించగా ఆమె ఓకే చెప్పింది.సాంగ్ సెట్స్ కూడా వచ్చింది.అయితే ఈ సాంగ్ లో స్టెప్స్ వేస్తుండగా ఆమెకు ఆరోగ్యం సహకరించలేదట.దీనితో ఆమె కోలుకోవడానికి కొంత సమయం పట్టింది.సాంగ్ సెట్స్ కూడా వేసి ఉండటంతో ఆ సాంగ్ లో నటించే ఆఫర్ అయేషా ఖాన్ కి దక్కింది.ఈ సాంగ్ కనుక ఈషా చేసి ఉంటే తన కెరీర్ కు ఉపయోగపడేది అని సినీ విశ్లేషకులు తెలిపారు.

Show comments