ఈషా రెబ్బ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన నటనతోఅందరిని ఎంతగానో అలరించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు టాలెంట్ ఎంత వున్నా కానీ సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.ప్రస్తుతం ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. తన అందం,అభినయం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈషా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్ మరియు మలయాళ ఇండస్ట్రీ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.అక్కడ హీరోయిన్ గా బిజీ బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటి.అయితే సినిమాలలో నటించకపోయినప్పటికీ ఈషా రెబ్బ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందాల విందు చేస్తుంది. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
ఈ భామ సినిమాలతో పాటు ఓటీటీ సిరీస్ లో కూడా నటిస్తుంది.ఇది ఇలా ఉంటే ఈషా మాయాబజర్ ఫర్ సేల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సుమ అడ్డా షోలో పాల్గొన్నారు ఈ మూవీ టీమ్.తాజాగా ఈ షో ప్రోమో విడుదల కాగా ఇందులో ఈషా రెబ్బా చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారాయి. ఆ వీడియోలో ఒక టాస్క్ లో భాగంగా.. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుందని సుమ ప్రశ్నించగా వెంటనే.. ఈషా రెబ్బా బజర్ నొక్కుతూ మనం తొందరపడినప్పుడు అంటూ సమాధానం ఇచ్చింది.. దాంతో అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు.ఆ తర్వాత సుమ నీ ప్రేమ కథ చెప్పు అని అడగగా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.మరి వాళ్ల నాన్న ఎక్కడుంటారు..అని సుమ మళ్లీ అడగడం వంటివి చూపించి ఈ ప్రోమో ఫినిష్ చేశారు. మరీ సుమ అడిగిన ప్రశ్నలకు ఈషా ఎలాంటి సమాధానం చెప్పిందో తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.