Site icon NTV Telugu

Eesha Movie : సంతకం పెట్టాకే సినిమా.. ‘ఈషా’ షాకింగ్ ప్రమోషన్..

Eesha Movie

Eesha Movie

రీసెంట్ టైమ్స్‌లో హారర్ సినిమాల ప్రమోషన్స్ చాలా వెరైటీగా ఉంటున్నాయి. తాజాగా ‘ఈషా’ (Eesha) సినిమా టీమ్ కూడా ప్రేక్షకులకు ఒక వింత కండిషన్ పెట్టింది. ఈ సినిమా చూడాలంటే ఆడియన్స్ ఒక ‘అంగీకార పత్రం’ (Consent Form) మీద సంతకం పెట్టాలని చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న మేటర్ చూస్తుంటే హారర్ ప్రియులకు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తుంది.

Also Read : Eesha : ‘ఈష’ ప్రమోషన్స్‌లో మాట జారిన మంజూష ..

ఈ అంగీకార పత్రంలో సినిమా టీమ్ చాలా క్లియర్‌గా కొన్ని వార్నింగ్స్ ఇచ్చింది. సినిమాలో భయంకరమైన సీన్లు ఉంటాయని, సడన్‌గా వచ్చే షాకింగ్ ఎలిమెంట్స్ వల్ల భయపడితే అది ప్రేక్షకుల బాధ్యతేనని పేర్కొన్నారు. అంతేకాదు, సినిమా చూశాక ఇంటికెళ్ళినా సరే.. ఎవరో వెనక నుండి అడుగులు వేస్తున్నట్టు ఉన్నా, పక్కనే ఎవరో ఊపిరి పిలుస్తున్నట్టు అనిపించినా అది కేవలం మీ భ్రమ మాత్రమేనని చాలా ఫన్నీగా, థ్రిల్లింగ్‌గా రాశారు. ఒకవేళ భయం వేసినా లేదా పానిక్ అయినా టికెట్ డబ్బులు రీఫండ్ ఇవ్వబోమని, థియేటర్లో భయంతో అరిచేందుకు మాత్రం పర్మిషన్ ఉందని చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ వెరైటీ ప్రమోషన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచడంలో మేకర్స్ భలే సక్సెస్ అయ్యారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు!

Exit mobile version