యాంకర్ మంజూష గురించి మనందరికీ తెలిసిందే, సినిమా ఈవెంట్ ఏదైనా సరే తను ఉండాల్సిందే. అయితే తాజాగా ‘ఈష: ది హాంటెడ్ నైట్’ సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మంజూష మాట్లాడుతూ.. ‘వృషభ’ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది కదా అని ఏదో చెప్పబోతుంటే, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గట్టిగా కౌంటర్ వేశారు. “నీకు ఈ మధ్య ఈవెంట్లు చేయడం ఎక్కువైపోయిందో లేక నేనూ వాసు ఉన్నామని వృషభ అంటున్నావో అర్థం కావడం లేదు” అంటూ సరదాగా ఆటపట్టించారు.
Also Read : Prabhas : కొత్త డైరెక్టర్లకు ప్రభాస్ బంపర్ ఆఫర్..
నిజానికి ‘వృషభ’ అనేది వేరే సినిమా అయినప్పటికీ, మంజూష పొరపాటున ఆ పేరు ఎత్తడంతో అక్కడ అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ‘ఈష: ది హాంటెడ్ నైట్’ టీమ్ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రిస్మస్ రేసులో ‘ఈష’ ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి..!
