NTV Telugu Site icon

NCERT Books In Amazon: అమెజాన్‌తో విద్యా మంత్రిత్వ శాఖ ఒప్పందం.. అమెజాన్‌లో అందుబాటులోకి NCERT పుస్తకాలు

Ncert Books In Amazon

Ncert Books In Amazon

NCERT Books In Amazon: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పుస్తకాలు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో వారి ఇంటి వద్దకే అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. దీని కింద పుస్తకాల కొరత, నకిలీ పుస్తకాల సమస్య, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు పుస్తకాలను కొనుగోలు చేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇతర వస్తువుల మాదిరిగానే NCERT పుస్తకాలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

Deputy CMO: ఆహారంలో టీబీ బ్యాక్టీరియా కలిపి డిప్యూటీ సీఎంఓను చంపేందుకు యత్నం.. ఆడియో లీక్

అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, విద్యా మంత్రిత్వ శాఖ మధ్య ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కూడా NCERT పుస్తకాలు అందుబాటులో ఉండేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్, విద్యా మంత్రిత్వ శాఖ మధ్య సహకారం ఏర్పాటు చేయబడింది. ఈ ఏడాది ఎన్‌సీఈఆర్‌టీ దాదాపు 15 కోట్ల పుస్తకాలను ప్రచురిస్తుందని, ఇది గతం కంటే మూడు రెట్లు ఎక్కువని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఏటా దాదాపు 5 కోట్ల పుస్తకాలు వెలువడుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద పాఠశాల విద్య కోసం రూపొందించిన నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా ఎన్‌సిఆర్‌టి కొత్త పుస్తకాలను తీసుకువస్తోందని ఆయన చెప్పారు. దింతో ఇప్పుడు ఈ పుస్తకాలను ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ చేయవచ్చు.

Rohit Sharma: 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడు!

ఈ పుస్తకాలు దేశవ్యాప్తంగా సుమారు 20,000 పిన్ కోడ్‌లలో ఎంఆర్‌పీ వద్ద అందుబాటులో ఉంచబడతాయి. దీని కారణంగా ఇప్పుడు పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన పుస్తకాలు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకే లభిస్తున్నాయని ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ బిజినెస్ మేనేజర్ అమితాబ్ తెలిపారు. 65 రూపాయల విలువైన పుస్తకం అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో 200 నుండి 300 రూపాయలకు లభిస్తుందని, అయితే ఇప్పుడు ఈ పుస్తకాలు ఎంఆర్‌పీ ధరకు మాత్రమే లభిస్తాయని ఆయన చెప్పారు. ఇంకా మార్కెట్‌లో పుస్తకాలు అందుబాటులో లేకుంటే అమెజాన్ నుంచి సులువుగా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. NCERT 1963 నుండి పాఠ్యపుస్తకాలను ప్రచురిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 220 కోట్ల పుస్తకాలు, పత్రికలను ప్రచురించింది. సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు ప్రతి సంవత్సరం మూడు రెట్లు ఎక్కువ పుస్తకాలు ప్రచురించబడుతున్నాయి.