NTV Telugu Site icon

Padi Udaynandan Reddy : మనం అభివృద్ది చెందాలంటే విద్య ఒక్కటే మార్గం

Padi Uday Nandan Reddy

Padi Uday Nandan Reddy

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో యుప్ టీవీ అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి 200మంది నిరుపేద విద్యార్థులకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున రూ.6లక్షల విలువ గల చెక్కులను అందచేశారు. కార్యక్రమానికి గెళ్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి శ్వేత హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ.. మనం అభివృద్ది చెందాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. 6వ తరగతి నుండి 12వరకు పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ద చూపెట్టాలని, తనకు 1985లో మొదటి వేతనం రూ.4వేలు వచ్చేవని గుర్తు చేసుకున్నారు. సరిగ్గా ఎనిమిదేళ్లు గడిచే సరికి (1993) వరకు రూ.15లక్షల వేతనం వచ్చిందని, ఇన్ని డబ్బులు సంపాదించాలంటే కేవలం చదువు వల్లే సాధ్యమన్నారు ఉదయ్‌.

Also Read : Mobile Phone tracking system: ఫోన్ పోయిందా..? భయపడాల్సిన అవసరం లేదు.. మే 17న కొత్త ట్రాకింగ్ సిస్టమ్ అమలు..

నా స్వంత ఊరు వీణవంకలో కంప్యూటర్ ఎడ్జుకేషన్ ప్రారంభించానని, ఆ సమయంలో చాల మంది దీంతో ఏం లాభం అనుకున్నారని, ఇప్పుడు 63మంది నిరుపేద యువతులకు పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించానన్నారు. ఇక్కడ ఉండి పలు దేశాల్లోని కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని, వచ్చే విద్యా సంవత్సరం నుండి బైజ్యూస్ క్లాసులు రూ.99 అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. ఇలాంటి క్లాసులు వినడం వల్ల ఇక్కడ ఉండి ప్రపంచంలోని పలు కంపెనీల్లో ఉద్యోగం పొందవచ్చని, మంచి స్కిల్స్ తో కూడిన విద్య అందించి అభివృద్ది చేయడమే తన లక్ష్యమన్నారు ఉదయ్‌.

Also Read : RCB vs RR: నత్తనడకన ఆర్సీబీ ఇన్నింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!