ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వరుస మ్యాచ్‌లు ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభం కానుంది. 2019లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అనంతరం ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: NZ vs ENG: ఫోర్లు, సిక్సర్ల వర్షం.. టీ20 మ్యాచ్‌లో 407 పరుగులు!
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకానికి వచ్చాయి. టెస్ట్ మ్యాచ్ టికెట్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్కో టికెట్ ధర రోజుకు 60 రూపాయలు మాత్రమే. అంటే ఐదు రోజులకు కలిపి 300 రూపాయలు అన్నమాట. గరిష్ఠంగా రోజుకు 250 రూపాయల టికెట్ కూడా ఉంది. మొత్తం 5 రోజులకు కలిపి 1,250 రూపాయలు. ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. టికెట్స్ అమ్మకాలపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది.
