Edelweiss CEO Radhika Gupta Post on Rohit Sharma: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమి అనంతరం భారత ప్లేయర్స్ అందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ బయటికి వస్తున్న దుఖాన్ని ఆపుకుని.. మౌనంగా మైదానాన్ని వీడాడు. ఇది చూసిన అభిమానులు మరింత భావోద్వేగానికి గురయ్యారు. జట్టు కోసం కష్టపడిన హిట్‌మ్యాన్ కళ్లలో నీరు చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. ఇందులో ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘ఎడల్‌వీస్’ ఎండీ, సీఈవో రాధికా గుప్తా కూడా ఉన్నారు.
ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మను ఉద్దేశించి ఎడల్‌వీస్ సీఈవో రాధికా గుప్తా తన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ‘గొప్ప నాయకులకు కూడా చెడ్డ రోజులు ఉంటాయి. కన్నీరు మిమ్మల్ని ఏమాత్రం బలహీనంగా చేయదు. వంద కోట్ల హృదయాలు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి కెప్టెన్’ అని రాధికా గుప్తా పోస్టులో రాసుకొచ్చారు. తన పోస్టుకు మైదానంలో రోహిత్ శర్మ భావోద్వేగంతో ఉన్న ఓ ఓ ఫొటోను జత చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Congress Manifesto 2023: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. రైతులకు వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర!
ప్రపంచకప్ 2023లో భారత్ ఓటమి లేకుండా వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. లీగ్ దశలో 9, సెమీస్ మ్యాచ్ గెలిచిన భారత్.. ఫైనల్స్‌లో తడబడింది. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో చేతులెత్తేసి మూల్యం చెలించుకుంది. టోర్నీ ఆరంభం నుంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న రోహిత్.. ఫైనల్లో కూడా 31 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ప్రపంచకప్ 2023లో రోహిత్ 597 పరుగులతో టాప్-2 స్కోరర్‌గా నిలిచాడు.