NTV Telugu Site icon

ED Rides: దూకుడు పెంచిన ఈడీ.. పలు ప్రాంతాల్లో దాడులు..!

12

12

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దీపక్ సింగ్లా, చండీగఢ్‌ లోని ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం నివాసాలతో సహా పంజాబ్‌ లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడులు కొనసాగుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్నాయా అనేది స్పష్టంగా లేనప్పటికీ., జామ తోటల పరిహారం స్కామ్ సంబంధించి లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఫెడరల్ ఏజెన్సీ దాడులు నిర్వహిస్తోందని తెలుస్తోంది.

Also read: Siddharth Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. పెళ్లి కూతురు ఎవరంటే?

అంతకుముందు మార్చి 23న దేశ రాజధానిలోని ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఎక్సైజ్ పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు త్వరలో ప్రజల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సోదాలని చూస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దూకుడును పెంచినట్లుగా అర్థమవుతుంది.

Also read: Viral Video: వావ్.. కుక్కతో కలిసి విదేశీ వనిత చేసిన శివ తాండవ నృత్యం అదుర్స్..!