ఢిల్లీ మద్యం పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి, ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ కేసులో గెహ్లాట్కు ఈడీ విచారణకు రావాలని పిలిచింది. అయితే, ప్రస్తుతం ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కింద వాంగ్మూలాన్ని తీసుకోవాలని కైలాష్ గెహ్లాట్‌ను కోరినట్లు ఈడీ చెప్పుకొచ్చింది. ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన పలు అంశాలపై విచారించేందుకు రావాల్సిందిగా ఈడీ తెలిపింది.
Read Also: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..!
అయితే, ఈ పాలసీ రిటైలర్లకు దాదాపు 185 శాతం, టోకు వ్యాపారులకు 12 శాతం అధిక లాభాలను అందించిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. అలాగే, 600 కోట్లకు పైగా – లంచాలుగా ఇచ్చినట్లుగా ఈడీ అనుమానిస్తుంది. ఆ డబ్బును గోవా, పంజాబ్ ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగించినట్లు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఆరోపిస్తుంది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా తీహార్ జైలులో ఉన్నారు.