NTV Telugu Site icon

Delhi Liquor Scam: ఈడీ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ ఛార్జిషీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రూపొందించింది. కవిత వాడిన 10 మొబైల్‌ ఫోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఎమ్మెల్సీ కవితతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్‌ల పేర్లను చేర్చింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లోని కీలకాంశాలు తాజాగా లీకయ్యాయి. సమీర్‌ కంపెనీలో కవితకు 32 శాతం ఉన్నట్లు ఈడీ పేర్కొంది. శరత్‌ చంద్రారెడ్డి చేతుల్లో ఐదు రిటైల్‌ జోన్లను అభిషేక్‌రావు నడిపిస్తున్నట్లు పేర్కొంది. ఒబెరాయ్‌ హోటల్‌లో మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్లు విచారణలో సమీర్‌ మహేంద్రు చెప్పినట్లు ఈడీ చెప్పింది.

శరత్ చంద్రారెడ్డి, అభిషేక్‌, బుచ్చిబాబులను ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో సమీర్ మహేంద్రు కలిసినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది. అనంతరం నలుగురు కలిసి శరత్ చంద్రారెడ్డికి చెందిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో ఎల్‌1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ వెల్లడించింది. ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలో కవిత, అరుణ్‌ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్‌ నాయర్ పాల్గొన్నట్లు సమీర్ మహేంద్రు ఛార్జిషీట్‌లో పేర్కొంది ఈడీ. ఇండో స్పిరిట్‌ను వెనుక నుంచి నడిపించింది ఎమ్మెల్సీ కవిత అని, ముందుండి నడిపింది రామచంద్ర పిళ్లై అని ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఇండో స్పిరిట్‌లో నిజమైన పార్టనర్స్‌ కవిత, మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూపు పేరిట 192 కోట్ల లిక్కర్ దందా చేసినట్లు ఈడీ ఛార్జిషీట్‌లో తెలిపింది. 2022 జనవరి నెలలో కవిత నివాసంలోనే ఆమెను సమీర్‌ మహేంద్రు కలిశారని వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీ నిర్వహణపై కవితతో సమీర్‌ మహేంద్రు చర్చించినట్లు ఈడీ పేర్కొంది. అరుణ్‌ పిళ్లై తన ప్రతినిధి అని సమీర్‌కు కవిత చెప్పినట్లు ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్‌కు రూ. 192.8 కోట్లు లాభం వస్తే ఇదంతా నేరపూరిత విధానంలో ఆర్జించారని ఈడీ వెల్లడించింది. వచ్చే నెల 6న అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.

Mancherial Six Died Case: ఆరుగురు సజీవ దహనం కేసు కొలిక్కి…

కాగా, సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిన్న విచారణ చేపట్టగా సమీర్ విచారణకు హాజరయ్యారు. చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5లోపు చెప్పాలని ప్రతివాదులైన సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం తయారీ, సరఫరా సంస్థలను కోర్టు ఆదేశించింది.