Site icon NTV Telugu

ED vs West Bengal Govt: ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం..

West Bengal

West Bengal

ED vs West Bengal Govt: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం వార్ నడుస్తోంది. ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ చేసిన దాడుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని ఈడీ కోరుతోంది. ఇప్పటికే ఈ అంశంపై కలకత్తా హైకోర్టును కూడా ఈడీ ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై జనవరి 14న విచారణ జరగనుంది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతిక్ జైన్ ఇంట్లో జరిగిన సోదాల సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ దర్యాప్తును అడ్డుకున్నారని ఈడీ ఆరోపించింది. కీలక పత్రాలను తమ కస్టడీ నుంచి తీసుకెళ్లారని, ఇందుకు రాష్ట్ర పోలీసులు సహకరించారని తెలిపింది. చట్టబద్ధంగా జరుగుతున్న తనిఖీలను అక్రమంగా అడ్డుకున్నారని పేర్కొంది. డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ డేటా, కీలక ఆధారాలు బలవంతంగా తీసుకెళ్లి దాచేశారని ఈడీ వాదించింది. అయితే ఈడీకి తక్షణ ఉపశమనం ఇవ్వడానికి కలకత్తా హైకోర్టు నిరాకరించింది.

READ MORE: The Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’పై కాపీ ఆరోపణలు.. తమన్‌కు విదేశీ డీజే వార్నింగ్

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో క్యావియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును కోరింది. మరోవైపు, ఐ-ప్యాక్ సంస్థ ఈడీ దాడులను తీవ్రంగా ఖండించింది. చట్టానికి అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. తాము వృత్తిపరమైన నైతిక విలువలను పాటించామని, జరిగిన పరిణామాల వల్ల తమ పని మీద ప్రభావం పడదని ఐ-ప్యాక్ తెలిపింది. తమ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయదని, రాజకీయ పదవులు చేపట్టదని, పారదర్శకంగా రాజకీయ కన్సల్టెన్సీ సేవలకే పరిమితమని స్పష్టంగా వెల్లడించింది.

READ MORE: Aishwarya Rajesh : ‘ఓ సుకుమారి’ మూవీ నుంచి హోమ్లీ లుక్‌లో పలకరించిన ఐశ్వర్య రాజేష్

Exit mobile version