Site icon NTV Telugu

Big Breaking: ఆ రాజకీయ పార్టీల ఎలక్ట్రోరల్ బాండ్ల సీక్రెట్లను బయటపెట్టిన ఎన్నికల సంఘం..!

4elll

4elll

తాజాగా భారతదేశ ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ బాండ్ల సంబంధించి.. పార్టీల వారీగా రిడీమ్ చేసిన మొత్తంతో పాటు బ్యాంకు ఖాతాల సమాచారం లాంటి పూర్తి వివరాలను విడుదల చేసింది. ఈ సమాచారం ఎలక్షన్ కమిషన్ కి ఇదివరకే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి డిజిటల్ రూపంలో అందింది. ఎలక్ట్రో ఎలక్టోరల్ బాండ్‌ డేటాను రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో ఏప్రిల్ 12, 2019 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దాఖలు చేశాయి. అయితే ఇలా చేసిన సీల్డ్ కవర్లను తెరవకుండానే రాజకీయ పార్టీల నుంచి వచ్చిన డేటాను సుప్రీంకోర్టు లోనే ఉంచేశారు.

Also Read: Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో భారీగా బంగారం ప‌ట్టివేత‌..

అయితే మార్చి 15, 2024 నాటికి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆదేశాన్ని అనుసరించి సీల్డ్ కవర్లో ఉన్న పెన్ డ్రైవ్ లో రికార్డులను డిజిటల్ రూపంలో ఉన్న వాటిని భౌతిక కాపీల రూపంలో ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఆదివారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్లోడ్ చేసింది.

Also read: Copying in Group-1: గ్రూప్‌-1 పరీక్షల్లో కాపీయింగ్‌.. సెల్‌ఫోన్‌లో చూసి ఎగ్జామ్‌ రాస్తుండగా..

ఇదే విషయంపై ఫిబ్రవరి 15న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఎలక్ట్రోరల్ డేటాను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాండ్ల డేటాను అప్లోడ్ చేసింది. విచారణ నిబంధనలో భాగంగా సుప్రీంకోర్టుకు అందించిన సీల్డ్ ఎన్వలప్ ల వివరాలను ఎన్నికల సంఘం తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Exit mobile version