Raithubandhu: ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు ఊరట లభించింది. రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. నిధుల విడుదలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి.
Also Read: Telangana High Court: బర్రెలక్కకు భద్రత కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
తెలంగాణలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో రాష్ట్రంలో అమలు కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు నిలిచిపోయింది. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ.. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల విడుదల, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం అందించారు. తెలంగాణ ఎన్నికల సంఘం ఈ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకెళ్లగా.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రైతుబంధు విడుదలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.