NTV Telugu Site icon

Anjani Kumar: అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత!

Anjanikumar

Anjanikumar

Anjani Kumar’s suspension revoked by EC: తెలంగాణకు చెందిన ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజన ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని ఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, ఇలాంటిది మరోసారి జరగదని ఈసీకి ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్ హామీ ఇచ్చారు.

Also Read: Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్‌ ఉన్నారు. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే రేవంత్‌ రెడ్డిని ఆయన కలిశారు. దాంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. ఈ సస్పెండ్‌పై ఈసీకి అంజనీకుమార్‌ వివరణ ఇచ్చుకున్నారు. ఉద్దేశపూర్వకంగా తాను ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని, ఎన్నికల ఫలితాల రోజు రేవంత్‌ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, మరోసారి ఇలా జరగదని హామీ ఇచ్చారు. అంజనీకుమార్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది.

Show comments