NTV Telugu Site icon

Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్‌లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!

Evms

Evms

Telangana Lok Sabha Elections 2024 Results: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడు చోట్ల ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రం టీటీడీసీలో ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో.. కుమురంభీం జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో కొనసాగనుంది.

మొత్తం 156 రౌoడ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో టేబుల్‌పై 14 ఈవీఎంలను అధికారులు లెక్కించనున్నారు. మొత్తం ఓట్లు 16,50,175 ఉండగా.. 12,21,583 ఓట్లు పోలయ్యాయి. అంటే 74.03 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం ఏడు కౌంటింగ్ హాల్స్ ఉండగా.. ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. గంటకు నాలుగు రౌండ్లు పూర్తవుతాయి.

నియోజకవర్గం, పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు ఓట్లు, రౌండ్లు:
సిర్పూర్ – 320 – 1,63,944 – 23
ఆసిఫాబాద్ – 356 – 1,71,511 – 23
బోథ్ – 306 – 1,65,157 – 22
ఆదిలాబాద్ – 292 – 1,81,136 – 21
ఖానాపూర్ – 309 – 1,62,101 – 22
ముథోల్ – 306 – 1,85,168 – 22
నిర్మల్ – 311 – 1,92,546 – 22