Marburg Virus: ప్రపంచంలో వైరస్‌ల వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. అనేక వైరస్‌లు నేడు ప్రజలపై వాటి ప్రభావాలు చూపుతుండగా.. ప్రస్తుతం మార్బర్గ్ అనే మరో వైరస్ కూడా వచ్చి చేరింది. ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్ కారణంగా 9 మంది మృతి చెందారు. వారి శాంపూల్స్ సేకరించి టెస్ట్ చేసిన గినియా హెల్త్ సర్వీస్ అధికారులు అది మార్బర్గ్ వైరస్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధ్రువీకరించింది. దీంతో అక్కడి ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. అనుమానితులు, క్లోజ్ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌కి తరలించి వారిని పరీక్షిస్తోంది. ఇది ఎబోలా వలె ప్రాణాంతకమని గినియా ఆరోగ్యమంత్రి వెల్లడించారు. గినియాలోని ఒక ప్రావిన్స్‌ను నిర్బంధంలో ఉంచినట్లు ప్రకటించారు.
ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలో దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో అనుమానిత కేసులను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం గత వారం ప్రకటించింది. అయితే ముగ్గురి వ్యక్తుల్లో మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితితో చర్చల అనంతరం ఆ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్ ప్రణాళిక అమలు చేయబడింది. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్, పొరుగు జిల్లా మొంగోమోలో ఆరోగ్య హెచ్చరిక ప్రకటించబడిందని ఆరోగ్య మంత్రి మితోహా ఒండో అయేకాబా విలేకరుల సమావేశంలో చెప్పారు. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌లో 4,325 మందిని ఈ వైరస్ ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. వారందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 మధ్య తొమ్మిది మరణాలు సంభవించాయని, ఫిబ్రవరి 10 న ఆసుపత్రిలో అనుమానాస్పద మరణంపై ఇంకా పరీక్షలు జరగాల్సి ఉందని మంత్రి తెలిపారు.
Massive Fire Break : హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక అల్లాడిన రోగులు
మార్బర్గ్ వైరస్ అంటే.. ఈ వైరస్ ఓ రకంగా ఎబోలా కుటుంబానికి చెందిన అంటు వ్యాధి. ఇది గబ్బిలాల ద్వారా వ్యాప్తిస్తుంది. వాటి నుంచే మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు, దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ 2 నుంచి 21 రోజుల వరకూ ఓ వ్యక్తిలో సజీవంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 88 శాతం మరణాల రేటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మార్బర్గ్ వైరస్ చాలా ప్రమాదకరమైన వ్యాధికారకము. ఇది తీవ్రమైన జ్వరానికి కారణమవుతుంది, ఇది తరచుగా రక్తస్రావంతో కూడి ఉంటుంది. తరచుగా అనేక అవయవాలను లక్ష్యంగా చేసుకుంటుంది. శరీరం దాని సొంతంగా పనిచేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది ఫిలోవైరస్ కుటుంబంలో భాగం. ఇందులో ఎబోలా వైరస్ కూడా ఉంది. ఈ ఎబోలా ఆఫ్రికాలో విధ్వంసం సృష్టించింది.
Anushka: స్వీటీకి ఆ జబ్బు ఉందంట.. 20 నిముషాలు బ్రేక్ కూడా లేకుండా
మార్బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హైఅలర్ట్ ప్రకటించింది. గినియాలోని కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌లో తొమ్మిది మరణాలతో పాటు మరో 16 మందిలో జ్వరం, వాంతులు, రక్తంతో సహా అనుమానాస్పద లక్షణాలను చూపించాయి. ఇది అంగోలా, కాంగో, గినియా, కెన్యా, దక్షిణాఫ్రికా, ఉగాండాతో సహా ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో గతంలో చెదురుమదురు కేసులను గుర్తించినప్పటికీ, మధ్య ఆఫ్రికా దేశంలో మొట్టమొదటి సారిగా మార్బర్గ్ వ్యాప్తి చెందుతోంది. గత జులైలో, ఘనా మొదటిసారిగా రెండు మార్బర్గ్ మరణాలను నివేదించింది. పశ్చిమ ఆఫ్రికాలో మొదటి కేసులు కూడా ఉన్నాయి. సెప్టెంబరులో వ్యాప్తికి ముగింపు పలికినట్లు అధికారులు ప్రకటించారు. కానీ మళ్లీ ఇప్పుడు ఈక్వటోరియల్ గినియాలో అనుమానాస్పద మార్బర్గ్ కేసులను ప్రకటించిన తర్వాత గాబన్, కామెరూన్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పరీక్ష, సరిహద్దు నియంత్రణలు లేదా పరిమితులను అమలు చేశాయి.1979 నుంచి అధికార అధ్యక్షుడు టియోడోరో ఒబియాంగ్ న్గ్యుమా ఎంబాసోగో నేతృత్వంలోని చమురు సంపన్న రాష్ట్రమైన ఈక్వటోరియల్ గినియాలో స్థానిక అధికారులకు మద్దతుగా ప్రత్యేక బృందాలను పంపినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే గబ్బిలాలకు దూరంగా ఉండాలి. వీటితో పాటు పెంపుడు జంతువులకి కూడా దూరంగా ఉండాలి. గబ్బిలాలు పెంపుడు జంతువులకి సన్నిహితంగా ఉంటాయి కాబట్టి. అదే విధంగా.. మాంసం తీసుకున్నప్పుడు శుభ్రం చేసి ఉడికిన తర్వాతే తీసుకోవాలి. ఇది గాలి వల్ల వ్యాపించదు కానీ, వైరస్ సోకిన వారిని తాకడం, శరీర ద్రవాలు, రక్త మార్పిడి, రోగుల పడక, దుస్తులను వినియోగించడం వంటి వల్ల సోకుతుంది. వర్షాకాలం కాబట్టి ఈ వైరస్ త్వరగా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం, జంతువులకి దూరంగా ఉండడం, పోషకాహారం తీసుకోవడం బయట ఆహారం కాకుండా ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం చాలా అవసరం.