మనిషికి గుండె చాలా ముఖ్యమైనది. రక్తాన్ని పంపిణీ చేసే కీలకమైన వ్యవస్ధ గుండె. నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ముఖ్యమైన గుండె అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ రోజుల్లో చిన్న పెద్దా అని తేడా లేకుండా.. గుండె సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం.. తినే ఆహారం, జీవనశైలి. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?
వాస్తవానికి.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. అయితే వాటిని ఆహారంలో తినడం జనాలు తగ్గిస్తున్నారు. దీంతో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే.. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెపోటు వంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను ఏ ఆహారాలు అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Arjuna Tree Bark: అర్జున బెరడుతో ఈ వ్యాధులకు చెక్.. ఎలా ఉపయోగించాలో తెలుసా..!
సోయాబీన్: గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలన్నింటిలో సోయాబీన్స్, సోయాకు సంబంధించిన పలు ఉత్పత్తులు ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లు, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. సోయాబీన్స్‌లో గుండెకు కావాల్సిన ప్రోటీన్లతో పాటు అన్ని రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అయిన విటమిన్లు కూడా సోయాబీన్స్ వల్ల శరీరానికి అందుతాయి.
అవిసె గింజలు: అవిసె గింజలు బరువు తగ్గించడంలో చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా.. ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. మీరు దీన్ని తినాలనుకుంటే.. ఈ గింజలను గ్రైండ్ చేసి పొడిని తయారు చేసుకుని తినవచ్చు.. లేదంటే విత్తనాల సహాయంతో లడ్డూలుగా తయారు చేసి తినవచ్చు.
అవకాడో: అవకాడో మోనోశాచురేటెడ్ కొవ్వుకు అద్భుతమైన మూలం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి కనీసం 2 అవకాడోలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16% తక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.
గుడ్డు: గుడ్లు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అంతేకాకుండా.. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. ఉదయం అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల రోజంతా శక్తిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డిన్ మరియు ట్యూనా వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపల నుండి లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వాల్‌నట్: డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడితే.. వాల్‌నట్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇవి తినడం వల్ల మీ శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉండదు. అయితే వాల్‌నట్‌లు ఎక్కువగా వేసవికాలంలో తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆవు పాలు: పాలు తాగడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా దానితో పాటు మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆవు పాలను వీలైనంత ఎక్కువగా తాగండి. ఎందుకంటే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇందులో కూడా ఉంటాయి.