NTV Telugu Site icon

Heart Attack : హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ వీటిని తినాలి..

Heart (2)

Heart (2)

మనదేశంలో ఈ మధ్య హార్ట్ ఎటాక్ తో చనిపోతున్న వారిసంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది. కోవిడ్ వచ్చి వెళ్లాక చాలా మంది రక్తం గడ్డ కట్టి చనిపోతున్నారు.. దీనికి కారణాలు అనేకం ఉన్నా కూడా అసలు కారణం ఇదని చెప్పలేకపోతున్నారు.. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..

అవకాడోల గురించి అందరికీ తెలిసిందే. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులతోపాటు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి మన శరీరంలో రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.. దాంతో హార్ట్ ఎటాక్ లు మన జోలికే రావు.. అలాగే మీ వంటల్లో ఆలీవ్ ఆయిల్ ను మన వంటల్లో చేర్చుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ లతో పాటుగా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి..

అదే విధంగా సాల్మన్‌, మాకరెల్‌, సార్డిన్స్ తదితర ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలను వారానికి ఒకసారైన తినాలి. శరీరంలోని వాపులను తగ్గించడంతోపాటు బీపీని నియంత్రిస్తాయి. దీంతో రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, ఇతర బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్ లభిస్తుంది. ఇవి బీపీని తగ్గిస్తాయి.. ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.