Gongura Pulihora Recipe: పులిహోర అంటే చాలామందికి గుర్తొచ్చేది చింతపండు లేదా నిమ్మకాయ. కానీ అవి లేకుండానే కేవలం గోంగూరతో చేసిన పులిహోర కూడా ఆలయ ప్రసాదం టేస్ట్‌ను ఇస్తుందని తెలుసా.. అవునండి బాబు.. దీని తయారీ చాలా సింపుల్. దాని రుచి మాత్రం సూపర్ అంతే.. ఇంట్లో అందరికీ నచ్చేలా ఉండే ఈ గోంగూర పులిహోర రెసిపీని ఇప్పుడు చూద్దాం.
ముందుగా అన్నం సిద్ధం:
ఒక గ్లాస్ (సుమారు 250 గ్రాములు) బియ్యాన్ని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి సుమారు రెండు గ్లాసుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత అన్నాన్ని పొడి పొడిగా చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి.
AI ఇన్‌స్టంట్ క్లిప్, IP69 రెసిస్టెంట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్తో Realme P4 Power 5G భారత్లో లాంచ్..
పులిహోర ప్రత్యేక పొడి తయారీ:
స్టవ్‌పై పాన్ పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మిరియాలు వేసి దోరగా వేయించాలి. చివరగా ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసి కాస్త వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆపై చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడే పులిహోర రుచికి సీక్రెట్ అవుతుంది.
గోంగూర పేస్ట్ తయారీ:
మీడియం సైజు గోంగూర కట్ట (సుమారు 100 గ్రాములు) తీసుకుని ఆకుల్ని వేరుచేసి శుభ్రంగా కడగాలి. పాన్‌లో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత గోంగూర ఆకులు వేయాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, చిన్న చింతపండు ముక్క వేసి నూనె విడిపడే వరకు వేయించాలి. గోంగూర మామూలుగానే పులుపుగా ఉంటుంది కాబట్టి.. చింతపండు చాలా తక్కువే సరిపోతుంది.
చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
అన్నంలో కలపడం:
ఆరబెట్టిన అన్నంలో గోంగూర పేస్ట్, ముందుగా తయారు చేసిన పులిహోర పొడి, అవసరమైనంత ఉప్పు వేసి మెల్లగా కలిపేయాలి. అన్నం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి.
ప్రీమియం డిజైన్ + పవర్‌ఫుల్ AI.. REDMI Note 15 Pro సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
తాలింపు వేసే విధానం:
అదే పాన్‌లో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కాస్త వేయించాలి. చివరగా పావు టీ స్పూన్ ఇంగువ, అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకేముంది ఈ తాలింపును అన్నంలో వేసి బాగా కలిపితే నోట్లో నీళ్లు తెప్పించే గోంగూర పులిహోర రెడీ.
ఇలా సింపుల్ స్టెప్స్‌తో తయారయ్యే ఈ గోంగూర పులిహోరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్ బ్యాక్ ను తప్పకుండా షేర్ చేయండి.
