Site icon NTV Telugu

Cucumber Rice Recipe: లంచ్‌బాక్స్‌కు పర్ఫెక్ట్.. ‘దోసకాయ అన్నం’ చేసేయండి ఇలా..!

Cucumber Rice

Cucumber Rice

Cucumber Rice Recipe: ఇంటి వంటల్లో కొత్తదనం కోరుకునేవారికి ఇది అద్భుతమైన రెసిపీ అనుకోవచ్చు. సాధారణంగా దోసకాయను సలాడ్ లేదా పచ్చడికే ఉపయోగిస్తాం. కానీ దోసకాయతో రుచికరమైన అన్నం తయారు చేయొచ్చంటే చాలా మందికి ఆశ్చర్యమే. అవునండి బాబు.. తక్కువ సమయంలో తేలికగా, ఆరోగ్యకరంగా సిద్ధమయ్యే ఈ దోసకాయ అన్నం లంచ్‌బాక్స్‌, త్వరగా భోజనం తయారు చేయడానికి, మిగిలిపోయిన అన్నం వినియోగానికి బాగా సరిపోతుంది. మరి ఈ కొత్త ‘దోసకాయ అన్నం’ ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం రండి..

Moringa Leaf Soup: జలుబు, దగ్గుకు చెక్ పెట్టండి.. వేడి వేడి మునగాకు చారును ఆస్వాదించండి!

దోసకాయలో ఉండే సహజ క్రంచ్, ఇంకా కొబ్బరి రుచి, మంచి సువాసన కలిసిపోతే ఈ అన్నం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే వంటకం ఇది. తయారీకి ముందుగా దోసకాయను తురుముకోవాలి. తురుముకున్న దోసకాయలో ఎక్కువ నీరు వస్తుంది. ఆ నీటిని తీసేయకపోతే అన్నం జిగటగా మారుతుంది. అందుకే తురిమిన దోసకాయను శుభ్రమైన గుడ్డలో పెట్టి బాగా పిండి నీటిని పూర్తిగా తీసేయాలి. ఇదే ఈ రెసిపీలో కీలకమైన దశ.

Jowar Upma Recipe: రుచీ, ఆరోగ్యం రెండూ కావాలా.. అయితే పొద్దునే ‘జొన్న ఉప్మా’ ఇలా ట్రై చేయండి..!

ఇక నూనె, నెయ్యి వేడి చేసి.. అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఆపై అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మెల్లగా వేయించాక కొబ్బరి, పిండిన దోసకాయ ముక్కలను జోడించాలి. చివరగా వండిన అన్నాన్ని కలిపితే దోసకాయ అన్నం రెడీ. చివరగా పైన కొత్తిమీర చల్లి, కావాలంటే వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయవచ్చు. ఈ అన్నానికి పెద్దగా సైడ్ డిష్ అవసరం లేదు. పాపడ్, ఊరగాయో చాలు. ఇవన్నీ ఒకే ప్లేట్‌లో కావాలంటే ఈ దోసకాయ అన్నాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

Exit mobile version