Site icon NTV Telugu

Earthquake: జపాన్‌లో 6.5 తీవ్రతతో భూకంపం

Earthquake

Earthquake

Earthquake: జపాన్‌లోని బోనిన్ దీవుల్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లోని బోనిన్ దీవుల్లో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) శనివారం సమాచారం ఇచ్చింది. భూకంప కేంద్రం 503.2 కిమీ (312.7 మైళ్ళు) లోతులో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇంతకు ముందు కూడా జపాన్‌లో బలమైన భూకంపాలు సంభవించాయి. కొత్త సంవత్సరం తొలిరోజు 7.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దేశం అతలాకుతలమైంది. భూకంపం సాయంత్రం 5.36 గంటలకు (08.36 గ్రీన్విచ్ మీన్ టైమ్)కు సంభవించిందని తెలిసింది. టోక్యోకు దక్షిణాన 875 కిమీ. దూరంలో పశ్చిమ కోస్తాలో భూకంపన కేంద్రబిందువు నమోదయింది. దీనివల్ల టోక్యోలో బలహీన కంపనాలు వచ్చాయి. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Mamata Banerjee: హెలికాప్టర్‌ ఎక్కుతూ జారిపడి పడిన మమతా బెనర్జీ.. మళ్లీ గాయాలు

Exit mobile version