NTV Telugu Site icon

Earthquake: తైవాన్‌, నేపాల్‌లో భూకంపం

Earthquake

Earthquake

Earthquake: తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ద్వీపం యొక్క తూర్పు తీరానికి సమీపంలో ఉన్న సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ బ్యూరో తెలిపింది.

Read Also: Jaggareddy: నాకు సీఎం కావాలని కోరిక ఉంది.. కచ్చితంగా సీఎం అవుతా

అటు నేపాల్‌లో కూడా భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. రాజధాని ఖాట్మండులో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Read Also: Nara Bhuvaneshwari: “నిజం గెలవాలి” కార్యక్రమంతో ప్రజల్లోకి నారా భువనేశ్వరి

Show comments