NTV Telugu Site icon

BREAKING NEWS: సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం..

Earthque

Earthque

సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 10 రోజుల వ్యవధిలో భూకంపం రెండు సార్లు వచ్చింది. న్యాల్కల్ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. కాసేపటి క్రితం పలు చోట్ల భూమి కంపించింది. ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.

Read Also: KFC: అయోధ్యలో కేఎఫ్సీ.. కానీ నాన్వెజ్ ఉండదు

ఇంతకుముందు.. న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కాగా.. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కానీ.. జిల్లాలో భూకంపం అనగానే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

Read Also: Lok Sabha: పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!