గోషామహల్‌లోని చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేశారు. అయితే.. ఒక్కసారిగా నాలా కుండిపోవడంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు, దుకాణాలు కుంగిన నాలాలో పడిపోయాయి. అంతేకాకుండా.. మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
Also Read : Boora Narsaiah Goud: ఉపాధిహామీ పథకం తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది
దాదాపు 50 కూరగాయల బండ్లు నాలాలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్దఎతున్న మార్కెట్ కు వచ్చిన జనాలను పోలీసులు తరలిస్తున్నారు. అయితే.. నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోపక్క ఎప్పుడు ఏమి కులుతాయో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నాలా కుంగడంపై పరిశీలిన చేస్తున్నారు.