Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?

Early Age Sex Results

Early Age Sex Results

Early Age Sex Results: చిన్న వయసులోనే లైంగిక జీవితాన్ని ప్రారంభించడం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని తాజా అధ్యయనం వెల్లడించింది. చైనాలోని షాన్డాంగ్ విశ్వవిద్యాలయం (Shandong University) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. తక్కువ వయసులో మొదటిసారి శారీరక సంబంధం కలిగిన వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించే అవకాశం ఉందని తేలింది.

ఈ పరిశోధన ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ తాజా అధ్యయనం ప్రకారం.. చిన్న వయసులోనే శృంగార జీవితాన్ని ప్రారంభించే వారిలో శారీరక బలహీనత, ఆరోగ్య సమస్యలు, జీవితకాలం తగ్గే ప్రమాదం లాంటివి ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు పెద్ద స్థాయిలో జన్యు (DNA) డేటాను విశ్లేషించారు. వ్యక్తులు మొదటిసారి ఎప్పుడు లైంగిక సంబంధం కలిగారనే అంశానికి సంబంధించిన జన్యు సూచనలను పరిశీలించి, వాటిని భవిష్యత్తులో ఆరోగ్య పరిస్థితులతో పోల్చారు.

పరిశోధకుల ప్రకారం.. చిన్న వయసులో శృంగార జీవితాన్ని ప్రారంభించడం నేరుగా వృద్ధాప్యానికి కారణమవుతుందని చెప్పలేము. అయితే మానసిక ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర ప్రవర్తనలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఒత్తిడి వంటి అనేక అంశాలు కలిసి ఈ ప్రభావానికి కారణమయ్యే అవకాశముందని వారు చెప్పుకొచ్చారు. ఈ సంబంధానికి కారణమయ్యే అంశాలను తెలుసుకోవడానికి పరిశోధకులు 145 రకాల కారకాలను పరిశీలించారు. వాటిలో 34 అంశాలు ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ADHD, డిప్రెషన్ లక్షణాలు, COPD వంటి శ్వాసకోశ సమస్యలు, శారీరక బలహీనత వంటి అంశాలు ఎక్కువగా ప్రభావం చూపినట్లు అధ్యయనం వెల్లడించింది.

ఇక ఈ పరిశోధనలో కీలక రీసెర్చ్ మాట్లాడుతూ.. “చిన్న వయసులో ఎదురయ్యే అనుభవాలు మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, శారీరక సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు” అని తెలిపారు. అలాగే యవ్వన దశలోనే సరైన మానసిక ఆరోగ్య సహాయం, లైంగిక ఆరోగ్య అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు కల్పించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చని సూచించారు.