NTV Telugu Site icon

AP EAPCET: ఈఏపీసెట్-2024 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్తో మీ రిజల్ట్స్ తెలుసుకోండి

Ap Eapcet

Ap Eapcet

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలు రిలీజ్ చేశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్‌ వెయిటేజీ మార్కులు రెండింటి ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు. అయితే, ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 పరీక్షను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మే 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 3, 62, 851 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు.

Plane Crash: మలావీ వైస్ ప్రెసిడెంట్‌తో సహా 9 మంది మృతి

అయితే, ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది విద్యార్థులు, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80, 766 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్ లో 1,95,092 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. మొత్తం 75.51 % ఉత్తీర్ణత పొందారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో 70,352 మంది విద్యార్ధులు అర్హత సాధించగా.. 87.11% ఉత్తీర్ణతులయ్యారు. ఇక, ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఒక్క క్లిక్ తో తమ ఫలితాలను https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు అని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.

Lok sabha: ఈనెల 24 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఎన్నిక!

ఇంజనీరింగ్లో ర్యాంకులు సాధించింది వీరే..
ఫస్ట్ ర్యాంక్, మాకినేని జిష్ణు సాయి
రెండవ ర్యాంకు, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి
మూడో ర్యాంకు, భోగలాపల్లి సందీష్
అగ్రికల్చర్లో ఫస్ట్ ర్యాంక్, యెల్లు శ్రీశాంత్ రెడ్డి(తెలంగాణ విద్యార్ధి)
అగ్రికల్చర్లో రెండవ ర్యాంక్, పూల దివ్యతేజ
అగ్రికల్చర్లో మూడవ ర్యాంక్, వడ్లపూడి ముకేష్ చౌదరి