మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేక పోయింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమపరమేశ్వరన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈగల్ నుంచి మేకర్స్ వరుస పోస్టర్లు రిలీజ్ చేయగా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈగల్ నుంచి మరో పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో మాస్ మహారాజా రవితేజ లాంగ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ లుక్ లో కనిపించాడు..రవితేజ ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తున్నాయి. ఈ సారి భారీ స్థాయిలో రవితేజ విధ్వంశం సృష్టించబోతున్నట్లు తాజా లుక్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఇప్పటికే విడుదల చేసిన ఈగల్ టీజర్ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఈగల్ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు .ఈ చిత్రంలో కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది., అలాగే నవదీప్, శ్రీనివాస్ అవసరాల మరియు మధుబాల వంటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డావ్జండ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.అలాగే రవితేజ మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో RT4GM (వర్కింగ్ టైటిల్)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తుండది..RT4GM మూవీ పూజా కార్యక్రమాలతో ఎంతో ఘనంగా మొదలైంది.
