Site icon NTV Telugu

Ghaziabad: ఈ-రిక్షా బ్యాటరీ పేలి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు

E Rikshaw

E Rikshaw

పర్యావరణ హితం, ప్రయాణ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్ లోకి అడుగుపెట్టిన ఎలక్ట్రిక్ వాహనాలు వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. బ్యాటరీలు పేలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్ లోని సర్వోదయ నగర్‌లో బ్యాటరీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయాలపాలయ్యారు. స్థానికులు కాలిన స్థితిలో ఉన్న నలుగురినీ జిల్లా ఎంఎంజి ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చారు.

Also Read:Mega Star : వ్యోమగాముల రాకనుద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

వైద్యులు నలుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో బాధితుల చేతులు, కాళ్లే కాకుండా ముఖం కూడా కాలిపోయింది. విజయనగరంలోని సర్వోదయ నగర్ నివాసితులైన బాబీ, అతని భార్య బేబీ, కుమారుడు వివేక్, కుమార్తె బినా బుధవారం ఉదయం కాలిన స్థితిలో ఆసుపత్రిలో చేరారని సిఎంఎస్ వైద్యుడు రాకేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ-రిక్షా బ్యాటరీ పేలడం వల్ల ఈ సంఘటన జరిగిందని తెలిపారు. బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

Exit mobile version