Site icon NTV Telugu

Formula E Car Racing: మళ్లీ తెరపైకి ఈ-కార్ రేసింగ్ నిధుల వివాదం..

E Car Racing

E Car Racing

హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల కేటాయింపులపై మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా కోర్టులో నిధులు మళ్లించడంపై విచారణకు విజ్ఞప్తి చేశారు. దీంతో.. దీనిపై విచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది.

Read Also: PM Pedro Sanchez: యూపీఐ ద్వారా గణేషుడి విగ్రహాన్ని కొనుగోలు చేసిన స్పెయిన్ ప్రధాని..

నిబంధనలు పాటించకుండానే నిర్వహణ సంస్థ ఎఫ్ఈఓ (FEO)కు రూ. 55 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. బోర్డు ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే 55 కోట్లు ఈ విదేశీ సంస్థకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందాన్ని అతిక్రమించడంతోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ 10 రద్దు అయింది. కాగా.. గత ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది.

Read Also: IND vs NZ 3rd Test: వాంఖడేలో మొదటి రోజు ఎవరికి అనుకూలం.. పిచ్ రిపోర్ట్ ఇదే..!

Exit mobile version