Site icon NTV Telugu

Pawan Kalyan: ఇక ఆ బాధలు ఉండవు.. హామీ ఇస్తున్నాం..

Pawan

Pawan

Pawan Kalyan: ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. అనంతపురంలో నిర్వహించిన సూపర్‌ సిక్స్‌ – సూపర్‌ హిట్‌ సభలో ఆయన మాట్లాడుతూ.. శివతాండవాన్ని వినిపించిన నేల ఇది.. ఎందరో కవులు, కళాకారులు పుట్టిన నేల ఇది.. సీమకు ఎప్పుడూ కరువు కాలం, ఎండా కాలమే.. దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్‌ అన్న ఆయన.. పార్టీలు వేరైనా, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్ హామీలతో ఎన్నికల్లో ఘన విజయం సాధించాం అన్నారు.. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తికీ 25 లక్షల రూపాయల ఆరోగ్య భీమా అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు..

Read Also: MLA Raja Singh: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

ఇక, 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించామని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్.. 1,005 కోట్ల రూపాయలతో పీఎం జన్ మన్ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం.. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండవని హామీ ఇస్తున్నాం అన్నారు.. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం.. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తున్నాం, ఎవరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేశాం అన్నారు.. ప్రజా ప్రయోజనాల కోసం ఐక్యంగా కూటమి పార్టీలు కలిసి కొనసాగుతాయి అని స్పష్టం చేశారు.. రాయలసీమను రతనాల సీమగా మార్చి చూపిస్తాం.. ఏపీని నంబర్‌ వన్‌గా తీర్చిదిదుత్తాం అన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version