ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి పవన్ కల్యాణ్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడ లో నాపై పోటీ చేయాలన్నారు ద్వారంపూడి. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నాడని, పవన్ కళ్యాణ్ కు స్క్రిప్ట్ టిడిపి ఆఫీస్ నుంచి వస్తుందన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్. లేని పోనీ నిందలు పవన్ నా మీద వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యక్తిగతంగా ఉంటే మనం మనం చూసుకుందామని, పవన్ తన వ్యాఖ్యలతో కాకినాడకి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని, జ్ఞానం తో మాట్లాడు అంటూ ద్వారంపూడి ఫైర్ అయ్యారు.
Also Read : Pailla Shekar Reddy: పైళ్ల శేఖర్ రెడ్డిని విచారించిన ఐటీ.. ఆ పత్రాలు అందించిన అధికారులు
బెస్ట్ లివింగ్ సిటీ ఆఫ్ ఇండియా గా కాకినాడ నాలుగవ స్దానము లో ఉందని, పండించిన పంట మాకు ఇవ్వడానికి రైతులు అమాయకులా? అని ఆయన ప్రశ్నించారు. ఇరవై ఏళ్లుగా మా కుటుంబం రైస్ బిజినెస్ లో లేమని, ఎగుమతులు మాత్రం చేస్తున్నామన్నారు. అవగాహన లేకుండా మాట్లాడకు అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అవుతున్న రైస్ లో 90 శాతం బయట రాష్ట్రాలు నుండి వస్తుందన్నారు.