Site icon NTV Telugu

Pawankalyan OG: పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమాపై డీవీవీ మూవీస్ కీలక ప్రకటన..

Pawankalyan Og

Pawankalyan Og

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మీడియాతో మాట్లాతుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

READ MORE: Bangladesh: మరో భారత వ్యతిరేకిని విడుదల.. పీఓకేలో ఉగ్రవాదానికి సాయం..

ఈ ఘటనపై ప్రస్తుతం డీవీవీ మూవీస్ స్పందించింది. అభిమానులను ఉద్దేశించి ఓ పోస్ట్ షేర్ చేసింది. “ఓజీ సినిమాపై మీరు చూయిస్తున్న అభిమానం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓజీ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా ఓజీ.. ఓజీ అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఈ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025-ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం.” అని పేర్కొన్నారు.

READ MORE: AmberPeta Shankar: ఆ సినిమాలో అంబర్‌పేట శంకర్ యాక్టింగ్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చే…

Exit mobile version